సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్.. తన తదుపరి చిత్రం షూటింగ్‌పై దృష్టి సారించాడు. చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
ఈనెల 27 నుంచి హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ మొదలవబోతున్నట్టు సమాచారం. ఇందులో రామ్ చరణ్ పాల్గొనబోతున్నాడు. ఎక్కువగా బ్రేక్స్ లేకుండా వరుస షెడ్యూల్స్‌తో జులై వరకు షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. వీలైతే దసరాకు లేదంటే డిసెంబర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ‘ఆర్సీ 16’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మార్చిలో చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్, గ్లింప్స్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.