2019
మే 30: వైఎస్ వారసత్వంతో అద్భుతంగా పరిపాలించి, నాన్న పేరు నిలబెట్టాలని నా ఆశీస్సులు: విజయవాడలో సీఎంగా జగన్ ప్రమాణ సభలో సీఎం కేసీఆర్
జూన్ 18: బేసిన్లు లేవ్.. భేషజాల్లేవ్. రెండు రాష్ట్రాల నీళ్లపై కేంద్రం జోక్యం చేసుకునే దుర్గతి లేదు: కేసీఆర్ కామెంట్
ఆగస్టు 12: రాయలసీమను రతనాల సీమగా మారుస్త.. గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలు వృథా అయ్యాయి. శ్రీశైలం, సాగర్ కూడా నిండి కృష్ణా జలాలు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. నీళ్లు అలా వృథా కాకుండా నేనూ, జగన్ చర్చించుకున్నాం. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి. రాయలసీమకు గోదావరి జలాలు రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకంగా, పట్టుదలగా పనిచేసే జగన్ సీఎంగా ఉన్నారు. రాయలసీమ కష్టాలు నాకు తెలుసు. జగన్‌కు పెద్దన్నగా కష్టాలు తీర్చడంలో నా ఆశీస్సులు, సంపూర్ణ సహకారం ఉంటాయి. ఇది కొందరికీ అర్థం కాకపోవచ్చు. మరికొందరికి అజీర్తి చేయవచ్చు.. : కంచికి వెళ్లి వస్తూ నగరిలో ఎమ్మెల్యే రోజా నివాసంలో కేసీఆర్
సెప్టెంబర్ 15: జగన్ నిజాయతీపరుడు, నీళ్లు తీసుకోవాలని నేనే చెప్పిన: అసెంబ్లీలో సీఎం కేసీఆర్
నవంబర్ 18: కృష్ణా నదిపై ఏపీ కొత్త లిఫ్ట్ స్కీం శీర్షికన ‘వీ6– వెలుగు’ మొదటి కథనం
డిసెంబర్ 12: ‘వెలుగు’ కథనాల ఆధారంగా పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపాలని కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ)కు తెలంగాణ ఈఎన్సీ కంప్లైంట్
డిసెంబర్ 13: పోతిరెడ్డిపాడు విస్తరణకు జగన్ ప్లాన్.. తెలంగాణకు నష్టంపై వీ6 -వెలుగు వరుస స్టోరీలు
2020
మే 5: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ కోసం ఏపీ ప్రభుత్వం జీవో నం. 203 జారీ.. రూ.6,820 కోట్లతో పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతి
మే 6: సంగమేశ్వరం ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని చెప్తూ ‘‘వీ6– వెలుగు’’ వరుస కథనాలు
మే 12: పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు
మే 21: ఏపీ అక్రమ ప్రాజెక్టుల ప్లాన్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో నారాయణపేట జిల్లా రైతు గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్. వెంటనే స్టే ఆదేశాలు జారీ చేసిన ఎన్జీటీ
జూన్ 3: ‘‘వీ6 వెలుగు’’ వరుస కథనాలతో మరోసారి కృష్ణా బోర్డుకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కంప్లైంట్
ఆగస్టు 5: కొత్త సెక్రటేరియెట్ నిర్మాణంపై మీటింగ్ సాకుతో అపెక్స్ కౌన్సిల్ భేటీని వాయిదా వేయించిన సీఎం కేసీఆర్
ఆగస్టు 19: సంగమేశ్వరం టెండర్ల ప్రాసెస్ పూర్తిచేసిన జగన్ సర్కారు
ఆగస్టు 21: ఎన్జీటీలో గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ పై తీర్పు రావాల్సిన రోజే కేసీఆర్ సర్కారు రీఓపెన్ పిటిషన్ ఫైల్ చేసింది. దీంతో వాయిదా పడిన తీర్పు
అక్టోబర్ 6: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన నష్టంపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తగిన స్థాయిలో అభ్యంతరం చెప్పలేకపోయిన సీఎం
అక్టోబర్ 29: ఏపీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ స్పష్టమైన తీర్పు. సర్కారు పిటిషన్ వల్లే గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ పై రెండు నెలలు లేటుగా వచ్చిన తీర్పు
డిసెంబర్ 13: సంగమేశ్వరం దగ్గర అక్రమంగా పనులు జరుగుతున్నాయని విజువల్స్, ఫొటోలతో వీ6–వెలుగు స్టోరీలు
డిసెంబర్ 19: సంగమేశ్వరం పనులపై కృష్ణా బోర్డుకు ఇరిగేషన్ ఈఎన్సీ కంప్లైంట్
డిసెంబర్ 22: ఎన్జీటీ తీర్పును ఏపీ ధిక్కరించినట్లుగా మళ్లీ పిటిషన్ వేసిన గవినోళ్ల శ్రీనివాస్. దీనిపై పిటిషన్ వేయకుండా సర్కారు సైలెంట్
2021
మార్చి 20: సంగమేశ్వరంపై కేఆర్‌ఎంబీకి
ఇరిగేషన్ ఈఎన్సీ ఫిర్యాదు
జూన్ 9: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు
తెలంగాణ ఈఎన్సీ కంప్లైంట్
జూన్ 24: ఆర్నెళ్ల ముందే వీ6– -వెలుగులో ఫొటోలు, విజువల్స్ వచ్చినా సంగమేశ్వరంలో పనుల ఫొటోలే దొరకలేదన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
జూన్ 25: ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తున్నట్లు ఈ మధ్యే తెలిసిందన్న మంత్రి జగదీశ్ రెడ్డి
జూన్ 25: గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ ఆధారంగా ఎన్జీటీ విచారణ, పనులు జరుగుతున్నట్లు తేలితే ఏపీ సీఎస్‌ను జైలుకు పంపిస్తామని వార్నింగ్
జూన్ 26: ఏడాదిన్నర పాటు సోయిలేనట్లుగా ఉన్న మంత్రుల వరుస ప్రెస్ మీట్లు. వీధిపోరాటాలు చేస్తాం, మానవబాంబులు అవుతాం అంటూ జనాన్ని రెచ్చగొట్టే మాటలు