నిమ్స్​లో సకాలంలో వైద్యం అందట్లే

  • ప్రోగ్రెసివ్ యూత్​లీగ్ ఆరోపణ 

ఖైరతాబాద్, వెలుగు: పంజాగుట్ట నిమ్స్ లో సకాలంలో వైద్యం అందట్లేదని, డైలీ అవుట్​పేషెంట్ల సంఖ్య 4 వేలకు చేరిందని ప్రోగ్రెసివ్​యూత్​లీగ్, పీఓడబ్ల్యూ ఆరోపించాయి. ఈ రెండు సంఘాల సభ్యులు సోమవారం నిమ్స్​లో అందుతున్న వైద్య సేవలపై నిర్వహించాయి. ఆర్థో పెడిక్​చికిత్స కోసం వస్తున్న పేషెంట్లకు స్ట్రెచర్​ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్​.ప్రదీప్, డి.స్వరూప ఆరోపించారు. నిమ్స్​ యాజమాన్యం నిర్వహించాల్సిన మెడికల్​షాపులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమేమిటని ప్రశ్నించారు. పార్కింగ్​ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని నిమ్స్​ డైరెక్టర్​ను ప్రశ్నించారు. పేషెంట్లు టాయిలెట్లకు వెళ్లినా పైసలు వసూలు చేయడం దారుణమన్నారు. ​ సర్వేలో సంఘాల సభ్యులు ఎం.రవికుమార్, బీఎస్ కృష్ణ, లక్ష్మీబాయి, వరలక్ష్మి, నిర్మల, బంగారి శ్రీనివాస్​తదితరులు పాల్గొన్నారు.