జై శ్రీరామ్.. రామనామంతో మార్మోగిన న్యూయార్క్‌ టైమ్స్‌ స్వ్కేర్‌

అయోధ్యలోని రామ మందిరంలో 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు ముందు అమెరికాలోని ప్రవాస భారతీయులు మిన్నెసోటాలోని హిందూ దేవాలయంలో రామభజన చేశారు. అదే సమయంలో, ట్రినిడాడ్, టొబాగోలో రామ్ జన్మభూమి స్థాపన సమితి, రామ మందిర్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ అండ్ భారతీయ ప్రవాసులతో కలిసి వేడుకలను నిర్వహించింది. ఇదే తరహాలో 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకను పురస్కరించుకుని అమెరికా అంతటా సంబరాలు జరుగుతున్నాయి.

న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ మందిర్' సభ్యులు లడ్డూలు పంచారు. అమెరికాలో కూడా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నట్లు సంస్థ సభ్యుడు ప్రేమ్ భండారీ తెలిపారు. ఈ ఈవెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కనెక్ట్ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన ప్రశంసించారు. తమ జీవితంలో ఈ దివ్యమైన రోజును చూస్తామని ఎప్పుడూ అనుకోలేదని, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరికాసేపట్లో జరుగుతోందని చెప్పారు. టైమ్స్ స్క్వేర్‌లోని ప్రజలు కూడా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ప్రదేశం అయోధ్య కంటే తక్కువేం కాదని భారతీయ ప్రవాసులు సంబరాలు చేసుకుంటున్నారని ప్రేమ్ భండారి తెలిపారు.

'వానవాస్' (అజ్ఞాతవాసం) తర్వాత రాముడు తిరిగి అయోధ్యకు వస్తున్నాడని, ఇదంతా ప్రధాని మోదీ నాయకత్వం వల్లే జరుగుతోందని భండారి చెప్పారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా 'రామ' వాతావరణాన్ని సృష్టించారని, ఆయన కేవలం 140 కోట్ల మంది ప్రజలను మాత్రమే కాకుండా, ఈ ఈవెంట్‌తో విదేశాలలో ఉన్న భారతీయ ప్రవాసులు కూడా ఈ రోజును దీపావళి కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నారు.

ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికా(US) అంతటా ఈవెంట్‌లు ప్లాన్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి బోస్టన్ వరకు, అలాగే వాషింగ్టన్, డీసీ, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలలో సైతం పలు కార్యక్రమాలు నిర్వహించారు.