- కూ బిజినెస్ స్టాండర్డ్ సచిన్ పన్సీకర్
శామీర్ పేట, వెలుగు: విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే సమయ పాలన ముఖ్యమని కూ బిజినెస్ స్టాండర్డ్ సచిన్ పన్సీకర్ పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లా తూంకుంటలోని విశ్వవిశ్వాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్ మెంట్ లోని సీకే ప్రహ్లాద్ ఆడిటోరియంలో 2021-–2026 విద్యాసంవత్సరానికి చెందిన 19వ బ్యాచ్ ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. విద్యతోపాటు సమాజానికి ఉపయోగపడే అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. విశ్వ విశ్వాని విద్యాసంస్థలో మెరుగైన అవకాశాలు ఉన్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గౌరవ అతిథిగా విచ్చేసిన అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ లెర్నింగ్ అండ్ ఆర్గనైజేషనల్ డెవలప్ మెంట్ హెడ్ ఎల్టన్ నాథన్ మాట్లాడుతూ.. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని సూచించారు.
విద్యార్థులకు ప్రత్యేక పరిజ్ఞానం, బలమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలను అభివృద్ధి పరిచేందుకు తమ సపోర్ట్ ఉంటుందని విశ్వ విశ్వాని గ్రూప్ అధ్యక్షుడు జీఎస్ఎస్ వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను కొత్తగా పీజీడీఎం కోర్సుల్లో చేరే విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విశ్వ విశ్వాని విద్యా సంస్థ పీజీడీఎం డైరెక్టర్ వై. లక్ష్మణ్ కుమార్ అసోసియేట్ డీన్ జయశ్రీ, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.