
- ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో వద్ద టిమ్స్ డ్రైవర్ల నిరసన
ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వేధింపులపై టిమ్స్ డ్రైవర్లు సోమవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. డీఎం విశ్వనాథ్ వేధింపులు రోజు రోజుకి పెరుగుతున్నాయని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్ ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఉన్నతాధికారుల అండదండలు తనకున్నాయని కార్మికులను బెదిరింపులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆర్టీసీ సంస్థ స్పందించి డీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి అధికారులు, కార్మికులు కలిసికట్టుగా పని చేయాలని డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా బస్సులను నడపాలని కోరారు. టీమ్స్ డ్రైవర్లతో పాటు డిపో మేనేజర్ ను కలిసిన అనంతరం వారు మాట్లాడారు. టీమ్స్ డ్రైవర్లకు సర్దిచెప్పి డ్యూటీలు సక్రమంగా చేయాలని సూచించగా తమను డీఎం వేధింపులకు గురి చేస్తున్నారని డ్రైవర్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ బొమ్మన బాలేశ్వర్ గౌడ్, ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు.