వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రియారిటీ ఆధారంగా ఓట్లు లెక్కిస్తున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో తీన్మార్ మల్లన్న లీడ్ లో కొనసాగుతున్నారు. రాత్రి 11కల్లా ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రియారిటీలో 50 శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేని పక్షంలో సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్కిస్తారు. నల్లగొండలోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్ లో ఓట్లను లెక్కిస్తున్నారు.