నిలబడితే 15 సీట్లొస్తయ్.. -అడుక్కుంటే 3, 4 మిగుల్తయ్‌‌‌‌: తీన్మార్‌‌‌‌ మల్లన్న

పరకాల, వెలుగు : రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్‌‌‌‌లు ఎన్నికల్లో సొంతంగా నిలబడితే 15 సీట్లు వస్తాయని, ఇతరులను అడుక్కుంటే 3 నుంచి 4 సీట్లు మాత్రమే దక్కుతాయని తీన్మార్‌‌‌‌ మల్లన్న చెప్పారు. మెపా రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగట్టు శ్రీనివాస్‌‌‌‌ అధ్యక్షతన హన్మకొండ జిల్లా పరకాలలో ఆదివారం జరిగిన ముదిరాజ్‌‌‌‌ సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌‌‌‌ వద్ద చేప పిల్లల లెక్క ఉంది కానీ ముదిరాజ్‌‌‌‌ల లెక్క లేదట అని ఎద్దేవా చేశారు.

ముదిరాజ్‌‌‌‌లకు కుల వృత్తి లేదని గతంలో సీఎం కేసీఆర్‌‌‌‌ అన్నారని, ఇప్పుడు రాజకీయమే ముదిరాజ్‌‌‌‌ల వృత్తి కావాలన్నారు. తెలంగాణలో ఫస్ట్‌‌‌‌ టైం బీసీ వ్యక్తి సీఎం కావాలని ఆకాంక్షించారు. ముదిరాజ్‌‌‌‌లు తమ ఓటును తమకే వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా పోరాడితే ముదిరాజ్‌‌‌‌లకు మద్దతు ఇస్తామన్నారు.