తొమ్మిదిన్నర ఏండ్ల శని వదిలింది : తీన్మార్ మల్లన్న

ధర్మపురి, వెలుగు: బీఆర్ఎస్​రూపంలో తొమ్మిదిన్నర ఏండ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న శనిని ప్రజలు వదిలించారని కాంగ్రెస్​పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి తీన్మార్ మల్లన్న చెప్పారు. ఆదివారం ఆయన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడినందుకు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరినదిలో ప్రత్యేక పూజలు చేశారు.

బీఆర్ఎస్​నాయకులు ఎన్నికల టైంలో తమకే ఓటు వేయాలని ఓటర్లకు డబ్బులు ఇచ్చి  ప్రమాణాలు చేయించారని, అవి తొలగిపోవాలని కోరుకుంటూ వారి తరఫున గోదావరిలో అభిషేకం చేశానని వివరించారు. ప్రమాణాలను గోదావరిలో కలపడానికే తాను ధర్మపురి వచ్చానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​పార్టీకి అండగా ఉండాలని కోరారు. తిరుగు ప్రయాణంలో ఎదురైనా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్​కుమార్ ను మల్లన్న కలిశారు.