
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 27వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఆందోల్ మండలం మాసాన్ పల్లి జాతీయ రహదారి బ్రిడ్జిపై వేగంగా దూసుకొచ్చిన టిప్పర్- కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రుడిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చినిపోయిన వారిని జోగిపేట గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు