- వరంగల్ జిల్లా నర్సంపేట రోడ్డులో బిట్స్ కాలేజీ వద్ద ప్రమాదం
వరంగల్: నర్సంపేట మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు పై వెళ్తున్న అన్నా చెల్లెళ్లను టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం నర్సంపేట - వరంగల్ రహదారి లో లక్నేపల్లి వద్ద ఉన్న బిట్స్ కాలేజ్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది.
టిప్పర్ ఢీకొనడంతో బైకుపై వెళ్తున్న అన్నా చెల్లెళ్లు తీవ్ర గాయాలతో క్షణాల్లో కన్నుమూశారు. మృతులు ఖానాపురం మండలం దబ్బిర్ పేట గ్రామానికి చెందిన ప్రసన్న ,రాకేష్ గా గుర్తించారు. వీరు వరంగల్ వెళుతుండగా టిప్పర్ ఢీ కొని చనిపోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానాకి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావం
కేంద్రం ధాన్యం కొనకపోతే ఇండియా గేట్ వద్ద పోస్తాం
పిల్లలకు వ్యాక్సిన్ మంచిదే కానీ ఎప్పట్లో ఇస్తారు ?