- మరొకరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
- గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన
గచ్చిబౌలి, వెలుగు : గచ్చిబౌలి పీఎస్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఓ టిప్పర్ లారీ.. ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్చనిపోయాడు. మరో ఎంప్లాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మం జిల్లా బయ్యారం పరిధిలోని ఉప్పలపాడు లక్ష్మీనరసింహపురానికి చెందిన చల్లా లోహిత్(24) గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి సోదరుడు చల్లా నవనీత్‌తో కలిసి గౌలిదొడ్డిలోని ఓ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు.
ఏపీలోని తెనాలికి చెందిన సాయి మహేశ్‌బాబు(24) బీహెచ్ఈఎల్లో ఉంటూ సాఫ్ట్వేర్జాబ్ చేస్తున్నాడు. లోహిత్, సాయి మహేశ్ ఫ్రెండ్స్. లోహిత్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తన టూవీలర్ మీద సాయి మహేశ్‌తో కలిసి అన్వయ కన్వెన్షన్ సెంటర్ వైపు నుంచి గౌలిదొడ్డి వైపు వస్తున్నారు. యూఎస్ కాన్సులేట్ రోడ్డు సమీపంలో వీరి బైక్‌ను వెనుక నుంచి స్పీడ్‌గా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. కంట్రోల్ కాక బైక్ పై నుంచి వెళ్లడంతో లోహిత్ అక్కడికక్కడే చనిపోయాడు. సాయిమహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ వడ్డె అశోక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.