హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. రాత్రి గచ్చిబౌలి విప్రో సర్కిల్లో ఓ టిప్పర్ ఆగి ఉన్న 4 కార్లు, రెండు బైక్ లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్గా గుర్తించారు. అబ్దుల్ అనే వ్యక్తి కాలు విరగడంతో హాస్పిటల్కు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
టిప్పర్ బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదంలో 4 కార్లు, 2 బైక్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన టిప్పర్ను పీఎస్కు తరలించారు.