రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. రాంగ్ రూట్ లో వచ్చిన కారుని టిప్పర్ లారీ ఢీకొట్టింది.
మై హోమ్ అవతార్ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. గంటసేపు శ్రమించి కారులో చిక్కుకున్న ముగ్గిర్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు నార్సింగి పోలీసులు.