మంచి నిద్ర కోసం టిప్స్

మంచి నిద్ర కోసం టిప్స్

పాతకాలం వాళ్లను అంటే... ఇంట్లో ఉండే తాత, బామ్మలను చూసి ‘ఇంత వయసొచ్చినా ఎంత హెల్దీగా, ఫిట్‌‌గా ఉన్నారు. వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటున్నారు. నిజంగా  ఆ రోజుల్లో తిన్న తిండి వల్లే కాబోలు. ఇప్పుడు కల్తీ ఫుడ్‌‌ తిని... మనం హెల్త్‌‌ పాడు చేసుకుంటున్నాం’ అని అనుకుంటారు చాలామంది. 
కాని ఫుడ్ ఒక్కటే కాదు డైలీ హ్యాబిట్స్‌‌ కూడా మన హెల్త్‌‌ను పాడు చేస్తున్నాయి. అందులో చాలా ముఖ్యమైంది నిద్ర.

ఈ మధ్య కాలంలో చాలామందిని పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనివల్ల చిన్నాపెద్దా అంతా ఇబ్బంది పడుతున్నారు. సరైన నిద్రలేక 35–40% మంది బాధపడుతున్నారు. మనిషికి దాదాపు 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. అది లేకనే శారీరకంగా, మానసికంగా సమస్యలు తెచ్చుకుంటున్నారు. పని ఒత్తిడి, నైట్‌‌అవుట్స్‌‌, మొబైల్ ఫోన్స్, టి.వి చూడటం అనేవి కూడా నిద్రలేమికి కారణాలు. నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లు మెడికల్‌‌ ఎక్సపర్ట్స్‌‌ సలహా తీసుకోవాలి లేదా లైఫ్‌‌ స్టైల్‌‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అందుకు కొన్ని రూల్స్‌‌ స్ట్రిక్ట్‌‌గా ఫాలో కావాలి.

సరైన నిద్ర లేకపోతే అలసట, చికాకు, ఒత్తిడి, గ్యాస్ట్రిక్‌‌, డైజెషన్‌‌ సమస్యలు, బద్ధకం, ఏకాగ్రత లేకపోవడం, యాంగ్జైటీ, డిప్రెషన్‌‌ల బారిన పడటం ఖాయం. అంతేకాదు ఒబెసిటి, స్లీప్‌‌ ఆప్నియా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే... కాగ్నిటివ్‌‌ బిహేవియర్‌‌‌‌ థెరపీ చేయించుకోవాలి. దీనివల్ల నిద్రలేమి లక్షణాలు యాంగ్జైటీ, డిప్రెషన్‌‌ పోయి, మంచి నిద్ర పడుతుంది. నిద్రపోయేముందు ఆల్కహాల్‌‌, కెఫిన్‌‌ తీసుకోవడం మానాలి. డాక్టర్‌‌‌‌ సలహాతో మందులు వేసుకోవాలి. 

అబ్‌స్ట్రక్టివ్ స్లీప్‌‌ ఆప్నియా పోవాలంటే..

నిద్రలో వచ్చే బ్రీతింగ్‌‌ ప్రాబ్లమ్‌‌ ఇది. వయసు, లావుగా ఉండటం వల్ల ఈ సమస్య వచ్చే ఈ వచ్చే అవకాశం ఉంది. గొంతు, నాలుకను కలిపి ఉండే కండరాలు మూసుకుపోవడం వల్ల నిద్రలో ఊపిరి అందకపోవడం, గురక లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో గొంతు ఎండిపోవడం, తలనొప్పి, డే టైంలో నిద్ర రావడంలాంటివి ఉంటాయి. దీన్ని ఇలాగే వదిలేస్తే మాత్రం హైపర్‌‌‌‌టెన్షన్‌‌, స్ట్రోక్స్‌‌, అరిథ్మియాస్‌‌, డయాబెటిస్‌‌, ఒబెసిటి, కార్డియోమయోపతి, హార్ట్‌‌ ఫెయిల్యూర్‌‌‌‌, హార్ట్‌‌ ఎటాక్‌‌ వంటివి రావచ్చు. ఇది రాకుండా ఉండాలంటే లైఫ్‌‌ స్టైల్‌‌ను మార్చుకోవాలి. బరువు ఎక్కువ ఉంటే తగ్గాలి. ఒక పక్కకు తిరిగి పడుకోవాలి. మత్తు పదార్థాలేవి తీసుకోకూడదు. డాక్టర్‌‌‌‌ను సలహాతో సిపిఎపి(కంటిన్యూస్ పాజిటివ్‌‌ ఎయిర్‌‌‌‌వే ప్రెజర్‌‌‌‌) మెషిన్‌‌ను పడుకునేముందు ముక్కుకు పెట్టుకోవాలి.

నిద్రలో ఎక్కువగా కదిలినా...

  • నిద్రలో ఎక్కువగా అటుఇటు కదులుతుంటారు చాలామంది. న్యూరలాజికల్‌‌ కండీషన్‌‌ వల్ల ఇలా చేస్తారు. దీనికి కారణం కండరాలపైన ఒత్తిడి, డిప్రెషన్‌‌, ప్రయాణ ఒత్తిడి వల్ల వచ్చే బాడీ పెయిన్స్‌‌, రోజులో చేసిన పనులు, నిద్రలేమి. ఇవి పోవాలంటే రెగ్యులర్‌‌‌‌గా ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయాలి, కెఫిన్‌‌ అలవాటు మానేయాలి. పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. కాళ్లను మసాజ్ చేసుకోవాలి. కండరాలపైన చల్లని లేదా వేడి ప్యాక్‌‌లను అప్లైచేయాలి.
  • మెలటోనిన్ సప్లిమెంట్స్‌‌ తీసుకోవడం వల్ల నిద్రలేమి, యాంగ్జైటీ సమస్యలు ఉండవు. కాని వీటిని తీసుకున్నపుడు తలనొప్పి, మైకం, వికారం ఉంటాయి. 
  • నిద్రలేమి ట్రీట్‌‌మెంట్‌‌కు లైఫ్​ స్టయిల్​ మార్చుకోవడం అనేది చాలా ముఖ్యం. నిద్ర పోయేముందు చక్కెర, కెఫిన్ తగ్గించాలి. ప్రతి రోజూ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయాలి. పొగాకు, ఆల్కహాల్‌‌ అలవాట్లు మానేయాలి.
  • నిద్ర పట్టకుండా ఏమైనా డిస్టర్బెన్స్‌‌ ఉంటే... వాటిని సరి చేసుకోవాలి. ఉదాహరణకు లైటింగ్‌‌ ప్రాబ్లమ్‌‌ ఉంటే కళ్లకు గంతలు కట్టుకోవాలి. సౌండ్‌‌ వినిపించకుండా కిటికీలు, డోర్లు వేయాలి.

తినకూడనివి...

  •   చీజ్‌‌లో ఎక్కువ హై సాచ్యురేటెడ్‌‌ ఫ్యాట్‌‌ ఉంటుంది. రెడ్ మీట్‌‌లో ప్రొటీన్, ఐరన్ ఉన్నా ఫ్యాట్ ఎక్కువే. ఇవి  త్వరగా జీర్ణం కావు. దాంతో నిద్ర దూరం అవుతుంది.  
  •   టొమాటోలో ఎక్కువగా టైరమైన్ అనే రసాయనం ఉంటుంది. ఇది మెదడును చురుకుగా ఉంచి నిద్ర పట్టనీయదు. సోయా సాస్, వంకాయ, రెడ్ వైన్, చీజ్‌‌లో కూడా టైరమైన్ ఉంటుంది. 
  •   నిద్రపోయే ముందు ఎక్కువగా నీళ్లు తాగొద్దు. ఎందుకంటే నిద్రలో ఒకటికి రెండుసార్లు బాత్రూమ్‌‌కి వెళ్లాల్సి వస్తుంది.

ఇవి తింటే నిద్ర పడుతుంది

  •   పాలు, ఎగ్‌‌ వైట్, పల్లి, ఆకుకూరల్లో ఎల్–ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడుకు వెళ్లి అక్కడ సెరోటోనిన్‌‌గా మారుతుంది. అది నిద్ర పట్టేందుకు సాయపడుతుంది. అరటిపండ్లు, వోట్స్, డార్క్ చాక్లెట్‌‌ కూడా తినొచ్చు. 
  •   మంచి నిద్ర పట్టాలంటే ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగాలని ఆయుర్వేదంలో ఉంది. జాజికాయ, బాదం, యాలకులను దంచి పాలలో కలుపుకొని తాగినా నిద్ర పడుతుంది.
  •   నిద్రలేమి పోవడానికి, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బి– విటమిన్‌‌ హెల్ప్‌‌ అవుతుంది. బీన్స్‌‌లో బి– విటమిన్‌‌ అంటే నియాసిన్‌‌, ఫోలేట్‌‌, విటమిన్‌‌– బి6 ఉంటాయి. ఇవి మెదడుకు చాలా రకాలుగా సాయపడతాయి.
  •   గుడ్డులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. పడుకునేముందు ఒక కప్పు టీతో పాటు ఉడికించిన గుడ్డును తేనెతో కలిపి తింటే మంచి నిద్ర వస్తుంది. పడుకునే ముందు ఒకటి లేదా రెండు కివీ ఫ్రూట్స్‌‌, వాల్‌‌నట్స్‌‌ తిన్నా నిద్ర త్వరగా వస్తుంది.