ఫ్రీజర్‌‌‌‌లో ఫుడ్‌‌ని స్టోర్‌‌‌‌ చేసేందుకు టిప్స్

ఫ్రీజర్‌‌‌‌లో ఫుడ్‌‌ని స్టోర్‌‌‌‌ చేసేందుకు టిప్స్


ఫ్రీజర్‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌ ఫ్రిజ్‌‌ టెంపరేచర్‌‌‌‌ కన్నా తక్కువ ఉండి ఫుడ్‌‌ని ఫ్రెష్‌‌గా ఉంచుతుంది. అయితే చాలామందికి ఫ్రీజర్‌‌‌‌ని ఎలా వాడాలో తెలియదు. ఫ్రీజర్‌‌‌‌లో ఫుడ్‌‌ని స్టోర్‌‌‌‌ చేసేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి.

  • ఫుడ్‌‌ని జిప్‌‌ బ్యాగ్‌‌లో చుట్టి ఫ్రీజర్‌‌లో స్టోర్​ఉంచాలి. అలా చేయకపోతే ఫుడ్ లోపలికి నీళ్లు పోయి పాడవుతుంది. ఆ ఫుడ్‌‌ తినడానికి పనికి రాదు.
  •  ఫ్రీజర్‌‌ కెపాసిటీ ఎంతుందో అంతే ఫుడ్‌‌ని స్టోర్‌‌‌‌ చేయాలి. లేదంటే ఫ్రీజర్ తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. 
  •  ఫ్రీజర్‌‌లో ఐస్‌‌ ఎప్పుడూ గడ్డ కట్టకుండా చూసుకోవాలి. ఐస్‌‌ గడ్డకడితే కొంతసేపు డీఫ్రాస్ట్ చేయాలి. డీఫ్రాస్ట్ చేసినా లోపల ఉన్న ఫుడ్‌‌ పాడవు తుందేమో అనుకుంటే పొరపాటు. ఆ ఫుడ్​కి ఏమి కాదు.
  • ఫ్రీజర్‌‌లో ఎక్కువ వేడిగా ఉన్న ఫుడ్‌‌ని పెట్టొద్దు. అలా చేస్తే ఫ్రీజర్‌‌ టెంపరేచర్ పెరిగి దాంట్లో ఉన్న మిగతా ఐటమ్స్‌‌ డీఫ్రాస్ట్ అవుతాయి. అందుకని ఫుడ్‌‌ చల్లారాకనే ఫ్రీజర్‌‌లో పెట్టాలి. ఫ్రీజర్‌‌లోఎక్కువ ఫుడ్‌‌ ఉంటే పోర్షన్స్‌‌లా పెట్టాలి. అప్పుడు కూలింగ్ ప్రాసెస్‌‌ తొందరగా అవుతుంది.
  • ఎక్కువ మొత్తంలో ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ ఫ్రీజర్‌‌లో ఉంటే వాటికి లేబుల్స్‌‌ వేసుకోవడం బెటర్‌‌‌‌. అంటే వండినవి, ప్యాక్ చేసినవి విడివిడిగా పెట్టాలి.