మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా..? ఈ చిట్కాలు పాటిస్తే ఇట్టే బయటపడొచ్చు..!

మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా..? ఈ చిట్కాలు పాటిస్తే ఇట్టే బయటపడొచ్చు..!

ప్రస్తుత రోజుల్లో ఆఫీస్, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది ఒత్తిడికి గురి అవుతున్నారు. ఇంటా బయటా సమస్యల వల్ల ఒత్తిడికి లోనై కొందరు ప్రాణాలు వదిలేస్తుండగా.. మరి కొందరు టెన్షన్ల నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులు ఉన్న వారిపై ఒత్తిడి మరింత ప్రభావం చూపిస్తోంది. ఒత్తిడి వల్ల టైప్ 1 డయాబెటిస్ రోగులు పూర్తిగా వేరే అనుభూతి చెందుతారు. 

ఎలాగంటే.. ప్రెజర్‎కు గురైనప్పుడు వీరి బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతాయి. ఇక, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు మానసిక ఒత్తిడికి గురైనప్పుడు వారి రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా పెరుగుతుంది. ఈ క్రమంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఒత్తిడిని జయించేందుకు హెల్త్ ఎక్స్‎పర్ట్స్ కొన్ని సూచనలు చేస్తున్నారు. డైలీ వీటిని ఫాలో అవుతే ఒత్తిడి నుండి బయట పడి డయాబెటిస్‎ను కంట్రోల్ ఉంచుకుని హెల్తీగా ఉండొచ్చని చెబుతున్నారు. 

అసలు ఒత్తిడిలో ఉన్నామని ఎలా గుర్తించాలి..?

తలనొప్పి, కండరాల నొప్పి, ఎక్కువ లేదా చాలా తక్కువగా నిద్రపోవడం, అలసట, చిరాకు, మనశ్శాంతగా లేకపోవడం, అందరికి దూరంగా ఉండాలనిపించడం, ఎక్కువ లేదా చాలా తక్కువగా తినడం, అతిగా మద్యపానం, ధూమపానం చేయడం వంటి లక్షణాలు మనలో కనిపిస్తే మనం ఒత్తిడిలోనవుతున్నామని అర్థం. దీని నుండి బయటపడాలంటే ఆరోగ్య నిపుణులు సూచనలు పాటిస్తే ఒత్తిడిని జయించవచ్చు. 

ALSO READ | Good Health: ఆస్తమా ఎందుకొస్తుంది.. లక్షణాలు ఏంటీ.. ఎట్లా తగ్గుతుంది.. రాకుండా ఏం చేయాలి..?

ఒత్తిడిని ఎలా నివారించాలి..?

ఫస్ట్ మీరు ఒత్తిడికి కారణాన్ని తెలుసుకోండి. మీకు ఒత్తిడిగా అనిపించిన సమయంలో మీ బ్లడ్ షుగర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఉదాహరణకు, చాలా మంది సోమవారం ఆఫీసులో చాలా ఒత్తిడికి గురవుతారు. మీ విషయంలో కూడా అదే జరిగితే.. ఆ రోజు మీ రక్తంలో చక్కెర స్థాయిలను ట్రాక్ చేయండి. అనంతరం ఒత్తిడికి గురి అవుతోన్న సరైన కారణం తెలుసుకోని ఆ సమయంలో దానిని నుండి బయటపడేందుకు ట్రై చేయండి. ఇలా కొన్ని రోజుల పాటు కంటిన్యూగా చేయడం ద్వారా బెటర్ రిజల్ట్స్ వస్తాయని హెల్త్ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.

ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి చిట్కాలు:

 క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
 యోగా లేదా తాయ్ చి వంటి వ్యాయామాలు
ధ్యానం
 కెఫిన్ తీసుకోవడం తగ్గించండి
స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి
 ఇష్టమైన ఆటలు ఆడటం, పాటలు పాడటం