టెక్నాలజీ పుణ్యామా అంటూ ఆన్ లైన్ లో మోసాలు, హ్యాకింగ్ లు జరుగుతున్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న సైబర్ నేరగాళ్లు భారీ ఎత్తున డబ్బును కొల్లగొట్టేస్తారు. అయితే సైబర్ నేరాల నుంచి సురక్షితంగా ఉండేలా గూగుల్ కొన్ని సలహాలు ఇస్తోంది. ఆ సలహాలు పాటిస్తే ఆన్ లైన్ మోసాల నుంచి సురక్షితంగా భయటపడొచ్చని చెబుతోంది.
- మీ బ్యాంక్ అకౌంట్ కు రికవరీ మొబైల్ నెంబర్ లేదా ఇ-మెయిల్ ను యాడ్ చేయండి. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఓటీపీ మొబైల్, ఈమెయిల్ కి మెసేజ్ వస్తుంది. దీంతో మీరు వెంటనే అలర్ట్ అవ్వొచ్చు.
- గుగూల్ చెప్పిన వివరాల ప్రకారం సగటు వ్యక్తి 120 కంటే ఎక్కువగా సేవ్ చేసిన పాస్ వర్డ్ లను గుర్తుపెట్టుకునేందుకు కష్టపడతాడని తెలిపింది. పాస్ వర్డ్ సింపుల్ గా కాకుండా కఠినంగా ఉండేలా సెట్ చేసుకోండి.
- మీ సిస్టమ్ లో కానీ, మొబైల్ లో కానీ యాప్స్, సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేయాలని మెసేజ్ వచ్చినప్పుడు పోస్ట్ పోన్ చేయకుండా అప్ డేట్ చేయండి. లేదంటే హ్యాకర్లు వైరస్ సాయంతో మిమ్మల్ని బెదిరిస్తారు.
- వన్ టైమ్ పాస్ వర్డ్ ను సెట్ చేసుకోండి. మీ జీమెయిల్ అకౌంట్ ను సైన్ అవుట్ చేయడం మరిచిపోతే..అనుమానాస్పద వ్యక్తులు మీ అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే ఓటీపీ సాయంతో సురక్షితంగా ఉండవచ్చు.
- గూగల్ మనకి సెక్యూరిటీ చెకప్ టూల్ ను అందిస్తుంది. దాని సాయంతో మీ జీమెయిల్ అకౌంట్లను ఎవరు ఎప్పుడు ఓపెన్ చేశారు. పాస్ వర్డ్ లు ఏమైనా మార్చారా అన్న విషయాన్ని కనిపెట్టవచ్చు.
- అనుమానాస్పదంగా ఉన్న యాప్ లను ఇన్ స్టాల్ చేయోద్దు. ఆన్ లైన్ మనీ ఎర్నింగ్ పేరుతో కొన్ని యాప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొంతమంది కేటుగాళ్లు ఆ యాప్ ల సాయంతో మీ బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బును దొంగిలిస్తారు. కాబట్టి అనుమానాస్పద యాప్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- మీ క్రోమ్ బ్రౌజర్ కి పాస్ వర్డ్ అలర్ట్ ను సెట్ చేసుకోండి. అనుమానాస్పద వ్యక్తులు అకౌంట్ ను ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే వెంటనే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది.