తిరుమల శ్రీవారికి ఆలస్యంగా నైవేద్యం : గేటు తాళాలు వేసుకుని వెళ్లిపోయిన సెక్యూరిటీ

తిరుమల శ్రీవారికి ఆలస్యంగా నైవేద్యం : గేటు తాళాలు వేసుకుని వెళ్లిపోయిన సెక్యూరిటీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో  విజిలెన్స్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుమల కొండపై ఇప్పటికే అనేకపర్యాయాలు తప్పిదాలు చేసిన విజిలెన్స్​ అధికారులు .. ఇప్పుడు స్వామివారికి పెట్టే నైవేద్యం విషయంలో నిరక్ష్యంగా వ్యవహరించారు.  నైవేద్యాలు తీసుకెళ్లే మార్గంలో గేటుకు తాళం వేయడంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించడం ఆలస్యమైంది.  సెక్యూరిటీ సిబ్బంది మధ్య సమన్వయలోపంతో ఇలాంటి తప్పిదం జరిగిందని సమాచారం.

శ్రీవారి ఆలయంలోని వసంతోత్సమ మండపం మెయిన్​ గేట్​ కు విజిలెన్స్​ సెక్యూరిటి అధికారులు  తాళం వేసి వెళ్లి పోయారు. పోటు నుంచి ప్రసాదాలను తీసుకొచ్చిన అర్చకులు గేటు వద్ద నిలబడిపోయారు.  బరువైన ప్రసాదం గంగాళాలను మోస్తూ.. ఎర్రటి ఎండలో అక్కడే నిల్చుకున్నారు.  వసంత మండపంలో వంసంతోత్సవాలు జరుగుతున్నాయి.  విజిలెన్స్​ అధికారుల నిర్లక్ష్యానికి శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : తిరుమల కొండపై ఇంత కంటే ఘోరం ఉంటుందా.. : మహా ద్వారం వరకు క్యూలో చెప్పులతో వచ్చిన భక్తులు

కలియుగ ప్రత్యక్ష దైవంగా… ఏడుకొండలవాడిగా అశేష భక్తజనం కొలుచుకునే శ్రీ వెంకటేశ్వరస్వామిని ఈ భూమిపైనే అత్యంత శక్తిమంతమైన దైవంగా భావిస్తారు. అందుకే తెలుగు వారే కాదు… ప్రపంచం నలుమూలల నుంచి రోజూ శ్రీవారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. అందుకే తిరుమల  గిరులు ఎప్పుడూ భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటాయి.  ఇలాంటి స్వామికి నైవేద్యం విషయంలో సెక్యూరిటి అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.