మేడారంలో ఘనంగా తిరుగువారం పండుగ

మేడారంలో ఘనంగా తిరుగువారం పండుగ

తాడ్వాయి, వెలుగు: ఐదు రోజుల పాటు మినీ మేడారం జాతర వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వన దేవతలను దర్శించుకున్నారు. బుధవారం మేడారం, కన్నేపల్లి, బయక్కపేటలో సమ్మక్క, సారలమ్మ దేవత పూజారులు, చంద వంశీయులు తిరుగువారం పండుగను నిర్వహించారు. ఆలయాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం వనదేవతలకు కోళ్లు, మేకలను ఎదురు మొక్కుకొని నైవేద్యంగా సమర్పించారు. ఈ రోజుతో మినీ మేడారం పండుగ ముగిసిందని పూజారులు తెలిపారు. వచ్చే ఆదివారం మేడారం గ్రామస్తులు చీడ పీడ పోవడానికి సమీప వనంలోకి వన భోజనాలకు వెళ్తారు. బుధవారం వన దేవతల దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.