తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజ స్థంభం కొక్కి ఊడిపోయింది. శుక్రవారం (అక్టోబర్ 4, 2024) సాయంత్రం ధ్వజారోహణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇలా జరగడం గమనార్హం. ధ్వజ పటం ఎగురవేయడానికి తాడును కట్టేందుకు ఈ కొక్కెంను వాడతారు. ఉన్నట్టుండి ఇలా జరగడంతో టీటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరో కొక్కెం రెడీ చేస్తున్నారు.
శుక్రవారం (అక్టోబర్ 4, 2024) నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5.45 గంటల నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ప్రైవేట్ ట్యాక్సీలపై ఆంక్షలు విధించారు. తిరుమలలో 9 రోజుల పాటు ట్యాక్సీలకు అనుమతి నిరాకరించారు.