తిరుమలలో చలి తీవ్రత బాగా పెరిగింది. నైరుతి బంగాళా ఖాతంలో నైరుతీ, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈదరుగాలులతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఘాట్ రోడ్లలో కొండ చెరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. బుధవారం ( డిసెంబర్ 11) రాత్రి నుండి వర్షం పడుతుండడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ALSO READ : తిరుపతిలో దారుణం: బస్సుతో ఉడాయించిన డ్రైవర్.. రోడ్డున పడ్డ 35 మంది అయ్యప్ప భక్తులు.
ఇదిలా ఉంటే స్వామి దర్శనానికి 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం, SSD టైమ్ స్లాట్ టోకన్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టిటిడి వెల్లడించింది. బుధవారం (డిసెంబర్ 11) 65 వేల 887 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25 వేల 725 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.88 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.