తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు

కలియుగ.. వైకుంఠం తిరుమల ఘాట్  రోడ్డులో ప్రమాదం జరిగింది.. మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల ఆర్చ్  దగ్గర కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురి భక్తులకు గాయాలయ్యాయి. 

కారు వేగంగా వచ్చి  డివైడర్ ను ఢీకొనడంతో కారు ముందుభాగం నుజ్జు నుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది   ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు . క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.