తిరుమల: ఘాట్​ రోడ్లపై వరుస ప్రమాదాలు.. భయాందోళనలో భక్తులు

తిరుమల: ఘాట్​ రోడ్లపై వరుస ప్రమాదాలు.. భయాందోళనలో భక్తులు

 తిరుమల ఘాట్​ రోడ్లపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.  తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది.  వరుస ప్రమాదాలు జరగడంతో  శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు.  శనివారం ( ఏప్రిల్​) 19 రాత్రి మొదటి ఘాట్​ రోడ్డులో బ్రేక్​ ఫెయిల్​ అదుపు తప్పిన టెంపో ట్రావెలర్​.. చెట్టును ఢీకొనడంతో పది మందికి గాయాలయ్యాయి.  ఈ ఘటన నుంచి తేరుకోకముందే .. ఆదివారం ( ఏప్రిల్​ 20)  ఉదయం రెండవ ఘాట్​ రోడ్డులో కారు దగ్ధమైంది.  మరో ప్రమాదంలో ఘాట్​ రోడ్డులో   అదుపు తప్పిన కారు  రక్షణ గోడను ఢీకొంది.  ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.