ఇంటర్ విద్యార్థుల పరీక్ష రిజల్ట్స్ రావడం…. వరుస సెలవులు .. వేసవి ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి దర్శనార్థం అనూహ్య రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.ఇంఇంటర్ ఫలితాలు శుక్రవారం విడుదల కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. తిరుమలంతా భక్తజన సంద్రంగా మారింది.
శనివారం( ఏప్రిల్ 13) భారీ స్థాయిలో నడక మార్గం గుండా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి., శ్రీవారి మెట్ల మార్గంలో భక్తుల కోలాహలం కనిపించింది. ఎటు చూసిన గోవింద నామ స్మరణ మారుమ్రోతగింది. ఇక విశేష సంఖ్యలో వస్తున్న భక్తులు దివ్య దర్శన టోకెన్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంపెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.ఇక నారాయణ గిరి ఉద్యానవనంలోని అన్ని షెడ్లు భక్తులతో నిండి క్యూలైన్ ఏటిజీహెచ్ అతిధి గృహం వరకు వ్యాపించి ఉంది. మరో రెండు వారాలు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం సర్వ దర్శనం కోసం క్యూలైన్ లో చేరుకున్నా భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతోంది. ఇక క్యూలైన్ లో వెచ్చియున్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదం., పాలు., మజ్జిగ., సుండల్ అందిస్తోంది. క్యూలైన్ లో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ.
శ్రీవారి మెట్ల మార్గంలో నడక మార్గలలో అనూహ్యంగా భక్తులు చేరుకున్నారు. రోజుకు ఇచ్చే 5 వేల టోకెన్స్ అయిపోవడంతో భక్తులకు నిరీక్షణ తప్పలేదు. 4 వేల టోకెన్స్ పూర్తి కావడంతో టీటీడీ టోకెన్స్ జారీ ప్రక్రియ నిలుపుదల చేసింది. దీంతో భారీగా శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు వెచ్చియున్నారు. . టైమ్ స్లాట్, కాలినడకన వచ్చే దివ్యదర్శనం భక్తులకు సుమారు 7 గంటలు పడుతుండగా, 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తలకు సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం తిరుమల శ్రీవారిని 82 వేల139 మంది భక్తులు దర్శించుకున్నారు. 39 వేల 849 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, రూ.3.97 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చింది.తిరుమలలో భక్తులు రద్దీగా ఉండడంతో ఎవరైనా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, స్త్రీల విషయంలో భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ కోరింది.