
తిరుమల కొండ కిక్కిరిసి పోయింది. వరుస సెలవులతో తిరుమలలో భక్తీ రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి. స్వామి దర్శనానికి 20 గంటలు సమయం పడుతుంది. ఈ క్రమంలో నారాయణగిరి షెడ్లను అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ( ఏప్రిల్ 20) ఉదయం తనిఖీలు నిర్వహించారు. క్యూలైన్లలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్న ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, హరీంద్రనాథ్, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
.