
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో అమూల్ నెయ్యి వినియోగిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం X యూజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఏడుగురు X యూజర్లపై కేసు నమోదు అయింది.
గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్..తాము టీటీడీ ఆలయానికి ఎటువంటి నెయ్యి సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.స్వచ్ఛమైన పాల కొవ్వుతో అమూల్ ఉత్పత్తులు తయారు చేస్తున్నామని తెలిపింది. ఈ తప్పుడు ప్రచారంతో అమూల్ పై ఆధారపడిన పాడి రైతు కుటుంబాలకు హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ALSO READ : లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ చేయండి.. గవర్నర్‌కు షర్మిల రిక్వెస్ట్
అమూల్ నెయ్యి ISO- సర్టిఫికేట్ పొందిన మా అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాలలో పాలతో తయారు చేయబడుతుంది.. స్వచ్ఛమైన అమూల్ ఉత్పత్తులపై తప్పుడు జరుగుతుంది.. అమూల్ బ్రాండ్ ను దెబ్బతీసేందుకే ఈ ప్రచారం సాగుతోందని ట్వీట్ చేసింది.తప్పుడు ప్రచారం వల్ల అమూల్‌పై ఆధారపడిన 36 లక్షల మంది పాడి రైతు కుటుంబాలకు నష్టం వాటిల్లుతుందని GCMMF మేనేజింగ్ డైరెక్టర్ జాయెన్ మెహతా అన్నారు.