తిరుమల: భక్తులు లేక ఖాళీగా ఉన్న పుష్కరిణి... ఎందుకంటే

తిరుమల: భక్తులు లేక ఖాళీగా ఉన్న పుష్కరిణి... ఎందుకంటే

తిరుమల శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు మొదలయ్యాయి. సాధారణంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలోని మరమ్మతులను పూర్తి చేసి నీటిని నింపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పుష్కరిణిని మూసివేసి మరమ్మతులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈక్రమంలో  భక్తుల అనుమతిని రద్దు చేసి ప్రస్తుతం ఉన్న నీటిని తోడే పనులను మొదలుపెట్టారు. తొలి పదిరోజులు నీటిని తొలగిస్తారు. తర్వాత పదిరోజులు మరమ్మతులేవైనా ఉంటే గుర్తించి పూర్తి చేస్తారు. చివరి పదిరోజుల్లో తిరిగి నీటిని నింపుతారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. కాగాప్రస్తుతం భక్తులకు ఇబ్బంది లేకుండా పుష్కరిణి వెనుకభాగంలో ప్రత్యామ్నాయంగా నీటి కొళాయిలను ఏర్పాటు చేశారు. భక్తుల అనుమతిని రద్దు చేయడంతో నిత్యం కిటకిటలాడే పుష్కరిణి  బోసిపోయింది.