వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగేలా తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాదాపు 42℃ డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు వరుణుని రాకతో 20℃ డిగ్రీలకు తగ్గుముఖం పట్టింది. నిన్న మధ్యాహ్నం ( మే 2) వర్షం కురిసింది. నిన్న (మే2) తిరుమలలో వాతావరణం చల్లబడగా ఈరోజు ( మే3) . ఉదయం నుంచి తన ప్రభావాన్ని చూసిన సూర్య భగవానుడు.. ఈ రోజు కూడా మధ్యాహ్న వేళకు వేడి నుంచి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షంతో ఉపశమనం కలిగింది. వేసవి కాలంలో కురిసే వర్షం కావడంతో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురి అయిన వేసవిలో ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు.
తిరుమలలో రోడ్లు అన్ని వర్షపు నీటితో నిండి పోయాయి. భారీగా కురిసిన వర్షానికి నాలుగు మాఢ వీదులు జలమయం కాగా..., స్వామి వారి దర్శనానికి వెళ్ళిన భక్తులు, స్వామి వారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిచి ముద్ద అయ్యారు. స్వామి వారి దర్శనం తరువాత వెలుపలకు వచ్చిన భక్తులు తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేసారు. గురువారం (మే 2) కరుణ చూపిన వరుణ దేవుడు శుక్రవారం ( మే 3) సైతం చల్లదనాన్ని ప్రసాదించాడు.
తిరుమలలో వర్షం కురిసి చల్లబడింది. సూర్యుడు ప్రతాపం చూపుతుంటే వరుణ దేవుడు వర్షంతో భక్తులను చల్లర్చారు. తిరుమలలో మే 3 మధ్యాహ్నం దాదాపు గంటలపాటు వర్షం కురిసింది. వేసవిలో ఎండలు మండిపోతుంటే నేడు కురిసిన వర్షానికి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.గంటపాటు ఆగకుండా వర్షం పడింది. నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడితో.. ఉక్కబోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో భక్తులు కూల్ అయ్యారు. తిరుమల కొండపైనే కాకుండా ఘాట్ రోడ్డు మొత్తం వర్షం పడటం విశేషం. దీంతో కొండ ఎక్కే వారు.. కొండ దిగేవారు వర్షంతో.. చల్లటి వాతావరణంతో సేదతీరారు. చాలా మంది భక్తులు వర్షంతో తడుస్తూ గంతులు వేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. కొండ కింద తిరుపతిలో మాత్రం వర్షం లేదు.. కేవలం తిరుమల కొండల్లోనే వర్షం పడింది.