తిరుమల శ్రీవారి దర్శనానికి 35 గంటలు

తిరుమల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.స్వామి వారి సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతోంది. నారాయణవనంలో షెడ్లు దాటి ఐదు కిలోమీటర్లు  మేర భక్తులు క్యూ లైన్ లో నిల్చొని వున్నారు. క్యూలైన్ లో  నిలబడిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ. 

భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్లను పరిశీలించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి. క్యూలైన్స్ వద్ద భక్తులకు అందుతున్న సౌఖర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే వీఐపీ, ఆర్జిత సేవల టికెట్ల జారీని నియంత్రించామన్నారు భూమన కరుణాకర్రెడ్డి.