తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కేసు..నలుగురు నిందితులకు పోలీసు కస్టడీ

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కేసు..నలుగురు నిందితులకు పోలీసు కస్టడీ

తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశాలుజారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ యఅయిన నలుగురు నిందితులకు ఐదురోజులపాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్‌ కోర్టు న్యాయ మూర్తి ఆదేశాలు జారీ చేశారు. 

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో నలుగురు నిందితులు  ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్, భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్, పొమిల్‌ జైన్, వైష్టవి డెయిరీ సీఈవో అపూర్వ చావ్డాలను  ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.ఇందులో భాగంగా నిందితులను జైలు నుంచి  తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు  సిట్ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు. 

మరో వైపు సిట్ లోని రెండు బృందాలు చెన్నై, ఉత్తరాఖండ్‌లో నిందితుల ఇళ్లు, వారికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ వ్యవహారంలో మిగతా వారి ప్రమేయంపై ఆరా తీస్తోంది సిట్‌. కీలక ఆధారాలతో త్వరలో మరికొందరిని అరె స్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.