TTD News: అలిపిరి పాదాల మండపం దగ్గరే శ్రీవారి దివ్యదర్శనం టోకెన్లు

TTD News: అలిపిరి పాదాల మండపం దగ్గరే  శ్రీవారి దివ్యదర్శనం టోకెన్లు

తిరుమల కాలినడకన తిరుమల వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు.  అన్నమయ్య భవనంలో టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 'భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం నుంచి ప్రాథమికంగా అనుమతి లభించింది. దీనిపై త్వరలోనే రాష్ట్రప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది. 

 దర్శనం, వసతి, శ్రీవారి సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను నియంత్రించేందుకు ఆధార్​ ప్రామాణికత ఎంతో ఉపయోగపడుతుందని ఈవో శ్యామలరావు అన్నారు. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు రూ.80 లక్షల విలువైన ‘గ్యాస్ క్రోమాటోగ్రాఫ్, హెచ్​పీ ఎల్​ సీ  పరికరాలను టీటీడీ కు ఉచితంగా అందించేందుకు నేషనల్ డెయిరీ డెవలప్​​ మెంట్ బోర్డు ముందుకు వచ్చింద్నారు. ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న సేంద్రియ పదార్థాల నాణ్యత తనిఖీకి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 

తిరుమలలో పారిశుద్ధ్యం పెంపునకు అత్యాధునిక యంత్రాల వినియోగంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. తిరునామ ధారణను తిరుమలలో పునఃప్రారంభించామని ఈవో వివరించారు. తిరుమల శ్రీవారిని ఆగస్టులో 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని.. . రూ.125.67 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 1.06 కోట్ల లడ్డూలు విక్రయించామని తెలిపారు.