![తిరుమల: అలిపిరి చెక్ పాయింట్ దగ్గర బారులు తీరిన వాహనాలు... ఇబ్బంది పడుతున్న భక్తులు](https://static.v6velugu.com/uploads/2025/02/tirumala-update-newsvehicles-heavy-que-in-alipiri-check-point_JITBdDxSEq.jpg)
తిరుమల స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొండపైకి కొన్ని నిషేధిత వస్తువులు తీసుకెళ్లడం.. అన్యమతాల పేరుతో ఉన్న వాహనాలు వెళ్లడం వంటి ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు అలిపిరి చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేసి పంపుతారు. ప్రస్తుతం ప్రైవేట్ వాహనాలపై అధికారులు నిఘా పెట్టి.. క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో అలిపిరి పాయింట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం కావడంతో తిరుమల వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దర్శనం స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి కొండపైకి చేరుకుంటామా లేదా అనే సందిగ్ధంలో పడిపోయారు.
మూడు రోజులుగా ( ఫిబ్రవరి 10 నాటికి) తిరుమలలో రద్దీ పెరిగింది. భారీగా భక్తులు ప్రైవేట్ వాహనాల్లో రావడంతో అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ఆలస్యమవుతుంది. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతనే వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు. వాహన తనిఖీలు ఆలష్యం కావడంతో వాహనాలు బారులు తీరాయి. దాదాపు గంట సమయం పడుతుందని తిరుమల శ్రీవారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ | తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు అరెస్ట్..
ఫిబ్రవరి 9 వతేదీన స్వామివారిని 84 వేల 536 మంది దర్శించుకున్నారు. తలనీలాలు 25 వేల 890 మంది సమర్పించగా ... హుండి ఆదాయం 3.67 కోట్ల రూపాయిలు వచ్చాయి. ప్రస్తుతం ( ఫిబ్రవరి 10 వతేది) ఉచిత సర్వదర్శనానికి 27 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటలు.. రూ. 300ల ప్రత్యేక దర్శనానికి 4 గంటలు సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ అన్ని చర్యలు చేపట్టింది..