కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తెలుస్తుంది.
గురువారం నాడు శ్రీవారిని 63 వేల 826 భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 530 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. జూలై 4 2024 నాటి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు.