తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన  తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను టీటీడీ  విడుదల చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ  ఏర్పాట్లు చేస్తుంది.

బ్రహ్మోత్సవాల  వివరాలు

  • అక్టోబర్ 4న ధ్వజారోహణం
  •  అక్టోబర్ 8న గరుడసేవ
  •  అక్టోబర్ 9న స్వర్ణరథం
  • అక్టోబర్ 11న రథోత్సవం
  •  అక్టోబర్ 12న చక్రస్నానం 

బ్రహ్మోత్సవాల సమయంలో  ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహనసేవలు ప్రారంభమవుతాయి.  ప్రతి  రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొండపైకి వచ్చే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.  అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ.. ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.  . భక్తులు దీనిని  సహకరించవలసిందిగా  టీటీడీ అధికారులు భక్తులకు విఙ్ఞప్తి చేశారు. టీటీడీ అక్టోబర్ 1న విఐపి బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ విఐపిలు మినహా) రద్దు చేసింది. సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా  అక్టోబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడుతుంది. 

ALSO READ | సీజేఐ కు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి లేఖ: తిరుమల లడ్డూ వివాదాన్ని సుమోటోగా స్వీకరించండి