ఈ సమ్మర్ హాలిడేస్లో తిరుమలకు వెళ్లే ప్లాన్లో ఉన్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..

ఈ సమ్మర్ హాలిడేస్లో తిరుమలకు వెళ్లే ప్లాన్లో ఉన్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..

తిరుపతి: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు సామాన్య భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతి ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.

అంతేకాదు.. వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది. మే 1 నుంచి జూలై 15 వరకు ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

వేసవి రద్దీ కారణంగా సామాన్యులకు అధిక ప్రాధాన్యత- ఇవ్వాలని TTD భావించడంపై సామాన్య భక్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రతీ ఏటా వేసవి రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది.

సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వీఐపీ బ్రేక్ దర్శనాలను కుదించేలా నిర్ణయం తీసుకుంది. బ్రేక్ దర్శనాల కారణంగా సామాన్య భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. సామాన్య భక్తులకు ఈ అసౌకర్యం కలగకుండా స్వయంగా తిరుమలలో దర్శనానికి నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ పరిమితం చేయనుంది.