
తిరుమల భక్తులకు టీటీడీ కీలక అలెర్ట్ చేసింది. ఈ నెలలో ( మార్చి) రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 25న కోయిల్‌ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24న దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది.
టీటీడీ తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈనెల 30వ తారీఖున శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని.. మార్చి 25వ తారీఖున మంగళవారం నాడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. ఈ కారణంగా మార్చి 25వ తేదిన వీఐపీ బ్రేక్ దర్శనం కొరకు మార్చి 24వ తారీఖున ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ ప్రకటించింది.
Also Raed : తిరుమలలో కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు
సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు.. ఆదివారం దర్శనం కొరకు.. స్వీకరిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. మార్చి 30వ తారీఖున ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ .. . ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రకటించారు. .