
నిర్మల్, వెలుగు: నిర్మల్‌కు చెందిన తిరునగిరి నిషిత 2023 మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచింది. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి నిషిత రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా అనే సంస్థ జాతీయ స్థాయిలో ఈ మిస్ ఇండియా పోటీలను నిర్వహించింది.
రన్నరప్‌గా నిలిచిన నిషితకు సంస్థ నిర్వాహకురాలు ఊర్మి వెండి కిరీటాన్ని అలంకరించారు. నిషిత తండ్రి ఎన్పీడీసీఎల్ లో ఉద్యోగం చేస్తారు. సోదరుడు మనీష్ కుమార్ ఢిల్లీలోని మినిస్టర్స్ సెక్రటేరియెట్‌లోని హోం మినిస్టర్ పేషీలో ఉద్యోగం చేస్తున్నాడు.