
తిరుపతి జిల్లాలో పుష్ప సీన్ ను రియల్ చేశారు కొంతమంది దుండగులు.. అయితే సినిమాలో ఎర్రచందనం తరలించగా.. తిరుపతిలో మాత్రం రియల్‌గా ఆవులను తరలిస్తున్నారు.. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.....
తిరుపతి జిల్లా గూడూరులో గోమాతలు తరలింపు మిస్టరీగా మారింది. పుష్ప సీన్ ను తలపిస్తూ.. కొంతమంది అక్రమార్కులు నెంబర్ ప్లేట్ లేని వాహనాల్లో ఆవులను తరలించడం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికి ( మార్చి 15) నాటికి 20 రోజుల నుంచి 150 ఆవులకు పైగా మత్తు మందు ఇచ్చి కొంతమంది ముఠాలుగా ఏర్పడి తరలిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆవులను ప్యాసింజర్, ట్రక్ లలో ఎక్కించి అర్ధరాత్రి వేళ అక్రమంగా తరలిస్తున్న వీడియోలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
Also Read : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. ఇద్దరు కొడుకులను చంపి ఆత్మహత్య
20 రోజుల క్రితం గూడూరు నిమ్మ మార్కెట్లో బండ్లకు కట్టిన ఎద్దుల అపహరించారు. అప్పటి నుంచి గోవుల మిస్సింగ్ కేసు పోలీసులకు అంతుచిక్కడం లేదు. గోవుల అదృశ్యం పై గూడూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై భూదనం టోల్ ప్లాజా వద్ద సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే విషయాలను గ్రహించారు. పుష్ప సినిమాలో ఎర్రచందనం తరలిస్తున్న విధంగా.. ఇక్కడ ఆవులను నెంబర్ ప్లేట్ లేని పాసింజర్ వాహనాల్లో తరలిస్తున్నట్లు గురించారు. గూడూరు శివారు ప్రాంతంలో గోవధ జరుగుతుందా అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. గోవుల యజమానులు విశ్వహిందూ పరిషత్, బ్లూ-క్రాస్ సంస్థలకు సమాచారం ఇవ్వడంతో ఆ సంస్థల ప్రతినిధులు తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.