తిరుమలలో ఘాట్ రోడ్డులో చిరుత హల్ చల్ చేసింది. ఇటీవల రెండవ ఘాట్ రోడ్డులో చిరుత సంచరించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. తాజాగా రెండవ ఘాట్ రోడ్డులో భక్తుల వాహనాలు తిరుపతి నుంచి తిరుమల వెళుతుండగా భక్తుల వాహనం ఎదుట అడ్డంగా చిరుత పరుగులు తీసింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురైయ్యారు. ఘాట్ రోడ్డులో అందాలను తమ సెల్ పోన్ లో చిత్రీకరిస్తూ ఉండగా హటాత్తుగా చిరుత కనిపించింది.
మే నెల 12 వ తేదీన కొంతమంది భక్తులు ప్రైవేటు వాహనాల్లో తిరుమల వెళుతుండగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో రెండో ఘాట్ రోడ్డులో చిరుత ప్రత్యక్షమైంది. వెంటనే సెల్ పోన్ ఆఫ్ చేసి వాహనానికి అద్దాలు మూసి అక్కడ నుండి వెళ్లిపోయారు. వెంటనే తిరుమలలో ఉన్న అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాహన దారులను అప్రమత్తం చేసారు. అయితే ఎప్పటికప్పుడు తిరుమల ఘాట్ రోడ్డుపై చిరుత కనిపిస్తూ వస్తోంది. దీంతో భక్తులు కాస్త భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలోని శేషాచలం అడవుల్లో వన్యప్రాణులు దర్శనమిస్తుంటాయి.అప్పుడప్పుడు ఘాట్ రోడ్లపైన సంచరిస్తుంటాయి. పాములు, కొండచిలువలు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, అడవి పందులు కనిపిస్తుంటాయి.తాజాగా తిరుమల రెండం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం రేగింది. తిరుమల అందాలను భక్తులు సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుండగా చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది.గతంలోనూ శ్రీవారి మెట్లమార్గంలో చిరుత పులులు సంచరించాయి. అయితే టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో నడక మార్గం, ఘాట్ రోడ్డులలో గత కొద్ది రోజులుగా చిరుతల ఆనవాళ్లు కనిపించలేదు. నిత్యం ట్రాప్ కెమెరాలతో ఫారెస్ట్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. గత ఏడాది (2023) లో చిన్నారి అక్షిత తిరుపతిలో చిరుత దాడిలో మృతి చెందింది. ఆ తరువాత అప్రమత్తమైన అధికారులు ఆరు చిరుతలను బోన్ లో బంధించిన అటవీ అధికారులు నాలుగు చిరుతలను అడవిలో వదలిపెట్టారు.