తిరుమల భద్రతను కేంద్రం పట్టించుకోవాలి..ప్రధాని.. హోంమంత్రికి తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ

తిరుమల భద్రతను కేంద్రం పట్టించుకోవాలి..ప్రధాని.. హోంమంత్రికి తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ

తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తిరుపతి  ఎంపీ గురుమూర్తి ప్రధాని మోదీకి.. హోం మంత్రి అమిత్​ షాకు.. హోం సెక్రటరీకి లేఖ రాశారు. టీటీడీ  పరిపాలన అస్తవ్యస్తంగా ఉందంటూ...తిరుమల జాతీయ ప్రాధాన్యత కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రమని లేఖలో పేర్కొన్నారు. . తిరుమలలో నెలకొన్న భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ తీసుకునే నిర్ణయాలతో  సమన్వయ లోపంతో తరచూ భద్రత లోపం జరుగుతుందన్నారు

వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం.. అన్నదానం క్యూ కాంప్లెక్స్​ వద్ద భక్తులను నియంత్రించలేక తొక్కిసలాట లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.  అత్యంత పవిత్రక్షేత్రం.. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల  కొండపైన నాన్​ వెజ్​ పదార్థాలు తినడం.. అలిపిరి చెక్​ పాయింట్​ దగ్గర తనిఖీలు జరుగుతున్నా.. కొంగమంది గంజాయి.. ఆల్కహాల్​ తీసుకెళ్లి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయన్నారు.  

ఇంకా ఎంతో పవిత్రంగా ఉండే పాప వినాశనం డ్యాంలో నిబంధనలకు విరుద్దంగా బోట్లను తిప్పుతున్నారని...   మార్చి 31న మతిస్థిమితం లేని వ్యక్తి  బైక్ పై తిరుమల కొండపైకి చేరుకున్నాడని.. ఇలాంటి ఘటనలన్నీ భద్రతావైఫల్యం వల్లే జరుగుతున్నాయని తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్రానికి లేఖ రాశారు.