అరుదైన అతిథులు అడుగిడనున్నాయి. చెంగు చెంగున గంతులేస్తూ కనువిందు చేయనున్నాయి. తిరుపతి జూలో చిన్నారులను, పెద్దలను అలరించనున్నాయి. తిరుపతి జూకు 10 కొత్త జంతువులు చేరుకున్నాయి. తిరుపతి జంతు ప్రదర్శనశాల (జూపార్క్)లోకి 6 హగ్ డీర్స్,4 హైనా లను తీసుకొచ్చారు.
అలాగే తిరుపతి జూ పార్క్ నుంచి రెండు రోజుల్లో కొన్ని జంతువులను కేరళలోని త్రివేండ్రం జూ పార్కు కు తరలించనున్నారు. రెండు లంగూర్ లను అక్కడికి తరలిస్తామని జూ అధికారులు తెలిపారు.