న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్ (క్యూ1) లో తమ రెవెన్యూ (స్టాండ్ ఎలోన్) 9 శాతం పెరిగిందని టైటాన్ ప్రకటించింది. క్యూ1 లో కొత్తగా 61 స్టోర్లను ఓపెన్ చేసింది. దీంతో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 3,096 కి పెరిగింది. టైటాన్ మొత్తం రెవెన్యూలో మూడో వంతు జ్యువెలరీ బిజినెస్ నుంచే వస్తుండగా, ఈ సెగ్మెంట్ క్యూ1 లో డొమెస్టిక్ మార్కెట్‌లో 9 శాతం గ్రోత్ నమోదు చేసింది.
కొత్తగా 34 స్టోర్లు ఓపెన్ చేసింది. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు తనిష్క్ సేల్స్ రెండంకల వృద్ధి నమోదు చేశాయని టైటాన్ ప్రకటించింది. కానీ, గోల్డ్ ధరలు ఎక్కువగా ఉండడంతో కన్జూమర్ డిమాండ్ కొంత తగ్గిందని తెలిపింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో పెళ్లిళ్లు తక్కువగా జరిగాయని పేర్కొంది.