టైటానియాకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌

టైటానియాకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: జీహెచ్​ఆర్​​ ఇన్ఫ్రా తన ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్  రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్  టైటానియా కోసం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) అందుకున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్​లోని కొండాపూర్‌‌‌‌‌‌‌‌లో  టైటానియా ఉంది. పర్యావరణ సంరక్షణ కోసం ఇక్కడ వర్షపు నీటి సేకరణ, ఎలక్ట్రిక్ వెహికల్​చార్జింగ్ స్టేషన్లు,  వేస్ట్​ రీసైక్లింగ్, సౌరశక్తి,  స్మార్ట్ లైటింగ్ వంటివి ఏర్పాటు చేశారు. 

ఈ బిల్డింగ్​కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు కూడా పొందామని జీహెచ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా సీఈఓ కార్తీష్ రెడ్డి మాడ్గుల చెప్పారు. దీనిని 4.7 ఎకరాల్లో నిర్మించామని, 480 యూనిట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.