![VD 12 నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. కింగ్ కోసం కిరీటం వెయిటింగ్..](https://static.v6velugu.com/uploads/2025/02/title-and-teaser-update-from-vijay-devarakoda-vd12_ahMupxFeoA.jpg)
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి క్రేజీ కాంబినేషన్ లో వస్తన్న సినిమా VD12 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తమిళ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి గతంలో లీక్ అయిన కొన్ని ఫోటోలు ఒక్కసారిగా హైప్ పెంచేసాయి. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 12న ఈ సినిమా టైటిల్ రివీల్ చేయడంతోపాటూ టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందులోభాగంగా ఈ విషయానికి సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో భగభగ మండుతున్న మంటల్లో కిరీటం కనిపిస్తుంది. అలాగే కింగ్ కోసం కిరీటం వెయిటింగ్.. అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ పోస్టర్ తో సినిమా ప్లాట్ ఏంటనేది సస్పెన్స్ చేశారు. మొత్తానికి విజయ్ దేవరకొండ VD12 అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ALSO READ | ప్రొడ్యూసర్స్ షాకింగ్ డెసిషన్... జూన్ 1నుంచి ఇండస్ట్రీ బంద్..
ఈ విషయం ఇలా ఉండగా గత కోనేళ్ళుగా విజయ్ కి సరైన హిట్ లేక సతమతవుతున్నాడు. ఈ క్రమంలో విజయ్ నటించిన ఖుషీ, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆడియన్స్ ని పెద్దగా అలరించలేక పోయాయి. దీంతో ప్రస్తుతం విజయ్ కెరీర్ చిక్కుల్లో పడింది. మరి VD12తో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
The silent CROWN
— Sithara Entertainments (@SitharaEnts) February 7, 2025
Awaits the KING ❤️🔥#VD12 TITLE & TEASER - 12th February 💥💥@TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/RP8H7YFlMt