
ముంబై: రోహిత్ శర్మ కెప్టెన్సీలో గతేడాది టీ20 వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా మరో ఐసీసీ టైటిల్‌ను అందుకోవడమే లక్ష్యంగా అరబ్ గడ్డపై అడుగు పెట్టింది. ఈ నెల 19వ తేదీ నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీ శనివారం దుబాయ్‌కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ ముంబై ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం సందడిగా మారింది. టీమిండియా ప్లేయర్లకు సెండాఫ్ ఇచ్చేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.
మిగతా ప్లేయర్లంతా టీమ్ బస్సులో చేరుకోగా.. తన సొంత కారులో వచ్చిన రోహిత్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్స్, సెల్ఫీలు ఇచ్చి వాళ్లను ఖుషీ చేశాడు. మిగతా క్రికెటర్లు కూడా ఆటోగ్రాఫ్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకుండా బరిలోకి దిగుతున్న ఇండియా గ్రూప్–ఎలో భాగంగా ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ వేటను ఆరంభించనుంది. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో తలపడుతుంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా అదే ఊపును కొనసాగించి చాంపియన్స్ ట్రోఫీని కూడా నెగ్గాలని టార్గెట్‌గా పెట్టుకుంది.