సీతా రామమ్(Sitha ramam) సక్సెస్ తరువాత పాన్ ఇండియా లెవల్లో హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) క్రేజ్ బాగా పెరిగిపోయింది. అందుకే ఈ హీరో నుండి వస్తున్న సినిమాలపై మంచి బజ్ క్రియేట్ ఆవుతోంది. మేకర్స్ కూడా దుల్కర్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇక తాజాగా ఈ హీరో మరోసారి తెలుగు డైరెక్టర్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.
AsloRead: కండక్టర్ తో మహిళ గొడవ.. ఐడీకార్డుపై చెలరేగిన వాగ్వాదం
ఇందుకోసం సర్ సినిమాతో ధనుష్(Danush) కు సూపర్ హిట్ అందించిన దర్శకుడు వెంకీ అంట్లూరి(Venky Atluri)తో జత కట్టారు. జులై 28 దుల్కర్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు "లక్కీ భాస్కర్(Lucky Baskar)" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ కాన్సెప్ట్ పోస్టర్ ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు దుల్కర్. దానికి.. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన సాధారణ వ్యక్తి కథే ఈ సినిమా అనే కాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. కాన్సెప్ట్ పోస్టర్ లో కూడా నోట్ల మధ్య దుల్కర్ మొహం సగం వరకు కనిపించేలా ఉంది. ఈ పోస్టర్ కూడా ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసింది.
ఇక సీతా రామమ్ తరువాత దుల్కర్ నుండి వస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా కావడంతో.. ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) సంగీతం అందిస్తున్నారు.
Presenting to you #LuckyBaskhar - Embark on a Captivating Journey, The Unraveling Triumphs of an Ordinary Man! ??#VenkyAtluri @gvprakash @vamsi84 @Banglan16034849 @NavinNooli #SaiSoujanya @sitharaents @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/NwNaZ9NAwC
— Dulquer Salmaan (@dulQuer) July 28, 2023