ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు : కోదండరాం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు : కోదండరాం

హైదరాబాద్:  తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ఎమ్మెల్సీ, టీజేఎస్ చీఫ్ కోదండరాం  తెలిపారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా అశోక్ కు, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ  స్థానంలో గోపాల్ రెడ్డికి మద్దతిస్తామన్నారు.  తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం మోసం చేసిందని ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, టీజేఎస్ తరపున గట్టిగానే నిలదీస్తామని స్పష్టం చేశారు. 

ALSO READ | త్వరలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి: కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్

నాంపల్లిలోని ఆఫీసులో ఆయన మీడిఆయతో మాట్లాడిన ఆయన.. 'తెలంగాణ ఉద్యమానికి మూల కారణాలైన వాటిలో నీళ్ల పంపకం ఒకటి. కృష్ణాజలాల నీటి వివాదంపై గత పదేండ్లు అధికారంలో ఉండి కూడా మాట మాట్లాడకుండా ఉన్న బీఆర్ఎస్ నేతలు.. ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి తాము పోరాటం చేస్తామని ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉంది.. . గత పదేండ్లలో మీరు మౌనం వహించడం వల్లే.. ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది' అని మండిపడ్డారు.