హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహానికి తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. సోమవారం మండలి లో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహం మన పోరాటాలకు వారసత్వంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ తల్లిని తొలుత ఇదే రూపం లో రూపొందించాం. నిరాడంబరంగా, మన సంస్కృతికి, త్యాగాలకు ప్రతిరూపంగా ఉంది. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, అమ్మవార్ల విగ్రహాలకు ప్రతీకగా నిలుస్తోంది. మహిళల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తోంది. ఇంత మంచి విగ్రహం రూపొందించి నందుకు కళాకారులకు, ప్రతిష్టిస్తునందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాను’’అని ఆయన పేర్కొన్నారు.