
- కేఆర్ఎంబీ జోక్యం చేసుకొని ఏపీని నియంత్రించాలి: కోదండరాం
- నీటి పంపకాల్లో గత బీఆర్ఎస్సర్కారు విఫలమైందని కామెంట్
హైదరాబాద్/బషీర్‌బాగ్, వెలుగు: కృష్ణా, గోదావరి నీటి వాటా కోసం పోరాటం ఉధృతం చేయాలని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కేంద్ర సర్కారు మోసం చేసిందని మండిపడ్డారు. కృష్ణా బేసిన్‌లో ఎక్కువ నీటిని ఏపీ తరలించుకుపోతున్నదని, కేఆర్ఎంబీనే నియంత్రించాలని అన్నారు.
3నీటి పంపకాల్లో గత బీఆర్ఎస్ సర్కారు విఫలమైందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకూడదని అన్నారు. శుక్రవారం నాంపల్లి టీజేఎస్ పార్టీ ఆఫీస్ లో కోదండరాం మీడియాతో మాట్లాడారు. పదేండ్ల పాలనలో మౌనంగా ఉన్న హరీశ్‌రావు.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం ఇప్పటికైనా కేంద్రం వెంటపడాలని బీఆర్ఎస్ ను కోదండరామ్ కోరారు.
కరీంనగర్-–మెదక్–-నిజామాబాద్-–ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వై. అశోక్ కుమార్ కు , వరంగల్-–నల్లగొండ-–ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. కరీంనగర్-–మెదక్-–నిజామాబాద్–-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని బలపరుస్తున్నామని చెప్పారు. రాజలింగ మూర్తిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
టైమ్ స్కేల్ కోసం విన్నవిస్తాం
యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ ఇవ్వాలని సీఎం రేవంత్‌కు విన్నవిస్తామని ఎమ్మెల్సీ కోదండరాం హామీ ఇచ్చారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో వర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లే న్యాయం జరుగుతుందన్నారు.